సీఎం రేవంత్, సీపీఐ నారాయణ మధ్య ఆసక్తికర సంభాషణ (వీడియో)

సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ నేతలు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మంగళవారం సచివాలయంలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆ పార్టీ నేతలు నారాయణ, చాటా వెంకట్ రెడ్డి, ఇతర నేతలు ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Update: 2024-01-02 11:41 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ నేతలు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మంగళవారం సచివాలయంలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆ పార్టీ నేతలు నారాయణ, చాటా వెంకట్ రెడ్డి, ఇతర నేతలు ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వ నిర్ణయాలకు తమ వంతు సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పడం సంతోషంగా ఉందని నేతలు తెలిపారు. రిటైర్డ్ ఐఏఎస్‌లకు తిరిగి బాధ్యతలు ఇవ్వొద్దని సీపీఐ నేతలు కోరగా ఇందుకు స్పందించిన సీఎం ఉన్నవారందరినీ తొలగించామని మళ్లీ తీసుకునే ఆలోచన లేదని చెప్పినట్లు సమాచారం.

Full View

మరోవైపు సింగరేణి అవకతవకలపై విచారణ జరిపించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్యమంత్రిని కోరారు. సింగరేణికి సీఎండీగా స్ట్రిక్ట్ అధికారి ఉండాలని కోరారు. ఈ సందర్భంగా నారాయణకు, సీఎం రేవంత్ రెడ్డికి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు అన్నట్లుగా కేసీఆర్ నీ కోసమే సచివాలయం కట్టినట్లుగా ఉందని సరదాగా వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News