వారిని బజారుకీడ్చటం కరెక్ట్ కాదు.. రేవ్ పార్టీపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరగడానికి బీఆర్ఎస్ చేసిన పాపాలే కారణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.

Update: 2024-05-21 13:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరగడానికి బీఆర్ఎస్ చేసిన పాపాలే కారణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పోరాటం ఎప్పుడూ బీజేపీనే ఉండాలని సూచించారు. ఇక బీఆర్ఎస్‌పై విమర్శలు చేసి ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వంలో నియంతృత్వ ధోరణి పెరిగిందని అన్నారు. ప్రశ్నించిన వారిని జైలుకు పంపించడం, ఈడీ, సీబీఐ అంటూ దాడులకు ఉసిగొల్పడం ఏంటని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణాన్ని రాజకీయంగా లబ్ధి పొందేందుకు బీజేపీ వాడుతోందని అన్నారు. ఇలా చేయడం వల్ల ప్రజలకు దర్యాప్తు సంస్థలపై నమ్మకం పోతుందని అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలన్నింటనీ బీజేపీ నిర్వీర్యం చేసిందని విమర్శించారు. బెంగళూరు రేవ్ పార్టీపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయని.. ఆ పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ కుట్రలో భాగంగా రేవ్ పార్టీతో సంబంధం లేని వ్యక్తులను బజారుకు ఈడ్చడం కరెక్ట్ కాదని అన్నారు.

Tags:    

Similar News