ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు.. మావోయిస్టు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య మరోసారి ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య మరోసారి ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. గన్ ఫైర్ తొన్లాయ్, టెట్రాయ్ గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగింది. మావోయిస్టులు ఉన్నారన్నా సమాచారం శుక్రవారం రాత్రి భద్రతా బలగాలు అటవీ ప్రాంతంలో జల్లెడ పట్టాయి. పోలీసుల కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందగా భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. తాజా కాల్పులతో ఈ ఏడాది ఇప్పటి వరకు మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 105కు చేరింది. పరిసర ప్రాంతాల్లో నక్సలైట్ల కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.