గూడూరు ఆశ్రమ పాఠశాలలో కరోనా కలకలం..
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని బాలుర ఆశ్రమ పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది.
దిశ, గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని బాలుర ఆశ్రమ పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది. పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులకు, అలాగే గూడూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అయోద్యపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ యమున తెలిపారు. ఈ నెల 8వ తేదీన 2, అలాగే 10 వ తేదీన 2 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. వీరందరినీ గూడూరు సామాజిక ఆసుపత్రిలో పరీక్షించి 7 రోజులు క్వారాంటైన్ లో ఉంచనున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.