Fraud consultancy : బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్ వేర్ కంపెనీ! ట్రైనింగ్ పేరుతో కోట్లలో వసూల్లు
నగరంలో మరో సాఫ్ట్ వేర్ సంస్థ బోర్డు తిప్పేసినట్లు తెలుస్తోంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్‌లో ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ పేరుతో ఒక కంపెనీని కేటుగాళ్లు స్టార్ట్ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలో మరో సాఫ్ట్ వేర్ సంస్థ బోర్డు తిప్పేసినట్లు తెలుస్తోంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్‌లో ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ పేరుతో ఒక కంపెనీని కేటుగాళ్లు స్టార్ట్ చేశారు. శిక్షణ ఇచ్చి జాబ్స్ కన్ఫామంటూ మాయ మాటలు చెప్పిన కంపెనీ ప్రతినిధులు దాదాపు 600 మందికి పైగా నిరుద్యోగుల నుంచి రూ.లక్ష, రూ.50 వేల చొప్పున డబ్బులు వసూలు చేశారు. బాధితుల నుంచి సుమారు పది కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తాజాగా సంస్థ ఆఫీస్‌కి తాళం వేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే గత కొంత కాలంగా నుంచి నిరుద్యోగులకు కంపెనీ శిక్షణ ఇచ్చినట్లు బాధితులు చెబుతున్నారు. దీన్నీ నమ్మి చాలా మంది యువత మోసపోయారని, మా డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేశారు.