కేసీఆర్ కరీంనగర్ సభపై కాంగ్రెస్ సెటైరికల్ ట్వీట్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై టీకాంగ్రెస్ సెటైర్ వేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో:బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై టీకాంగ్రెస్ సెటైర్ వేసింది. అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటూ పార్టీ సభలకు మాత్రం హాజరుకావడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. నిన్న కరీంనగర్ లో బీఆర్ఎస్ కదనభేరి సభకు గులాబీ బాస్ కేసీఆర్ హాజరై కాంగ్రెస్, బీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు. ఈ సభను ఉద్దేశించి బుధవారం టీ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయింది. అసెంబ్లీకి రావాలంటే వచ్చే కాలు నొప్పి ఎన్నికల సభకు పోవడానికి లేదా అంటూ ప్రశ్నించింది. చట్టసభకు రాకుండా ఉంటున్న మీకు ఎందుకు గెలిపియాలి అంటూ నిలదిసింది. ఈసారి గెలిపిస్తే సభకు రాకుండా సల్లగా జారుకోవడానికా? అంటూ ప్రశ్నించింది. గతంలో మీది దద్దమ్మ ప్రభుత్వం, చేతగాని పాలన అనే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించారని విమర్శలు చేసింది. దొరికిన కాడికి దొసుకవడం ఫాం హౌస్ లో దాయడం కాంగ్రెస్ పార్టీకి చేతకాదని స్పష్టం చేసింది.కాగా కేసీఆర్ తుండి మార్పిడి ఆపరేషన్ జరగడంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. అయితే అదే సమయంలో నల్గొండ, కరీంనగర్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఎన్నికల సభలంటే ఎనలేని గౌరవం ఈ పెద్ద మనిషికి...!!
— Telangana Congress (@INCTelangana) March 13, 2024
ఎన్నికల సభకు పోనీకే లేని నొప్పి..
పక్కనున్న అసెంబ్లీకి రావాలి అంటే ఎక్కడలేని నొప్పి..!
ఎందుకయ్యా.. గెలిపియ్యాలే మిమ్ముల.. సభకు రాకుండా సల్లగా జారుకునేటందుకా?!
సి....!! ఇగ ఎందుకులే అని అని మాకే సిగ్గైతుంది...!!#DopidiDora pic.twitter.com/p7zgcXwgXt