కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు

మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతల బాధితులకు భరోసానిచ్చేందుకు వెలుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు

Update: 2024-10-01 07:55 GMT

దిశ, వెబ్ డెస్క్ : మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతల బాధితులకు భరోసానిచ్చేందుకు వెలుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కేటీఆర్ వాహన శ్రేణిని అడ్డుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట సాగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను అదుపు చేశారు. చాదర్ ఘాట్ మూషీరాబాద్ మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్ళ కూల్చివేతల బాధితులకు భరోసానిచ్చేందుకు కేటీఆర్ వెలుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టుల పట్ల నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ కాన్వాయ్ ను అడ్దుకున్నారు. అలాగే మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని, అనవసరంగా ప్రజలను తప్పదోవపట్టిస్తూ, వారిని రెచ్చగొడుతున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. 


Similar News