బీఆర్ఎస్ హయాంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య: కాంగ్రెస్ MLA

వరంగల్ పార్లమెంట్ సీటును గెలిచి తీరాలనే పట్టుదలతో పనిచేస్తున్నామని జిల్లా కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.

Update: 2024-04-12 04:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ పార్లమెంట్ సీటును గెలిచి తీరాలనే పట్టుదలతో పనిచేస్తున్నామని జిల్లా కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఏఐసీసీ నిర్ణయం తర్వాత నేతలంతా ఏకతాటిపైకి వస్తారని అన్నారు. ఆరూరి రమేష్ బీఆర్ఎస్ ఆనవాయితీని కొనసాగిస్తున్నారని విమర్శించారు. అందరం ఏకతాటిపైకి వచ్చి వరంగల్ సీటు గెలిచే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. గత సీజన్‌లో వర్షాలు సరిగా పడకపోవడం మూలంగా రైతులకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయని అన్నారు. రైతులు గిట్టుబాటు అడిగితే ఖమ్మంలో బేడీలు వేయించిన కేసీఆర్.. ఇవాళ రైతులపై ప్రేమ ఒలకపోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

ప్రజల సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకొని గతంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. రాష్ట్ర రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని.. పండించిన ప్రతీ గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. పంటనష్టం జరిగిన వాటికి త్వరలోనే పరిహారం కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని మండిపడ్డారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి.. బీఆర్ఎస్‌ను భూస్థాపితం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌లో చేరే వారికి పెద్దన్నలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News