‘హరీష్ రావు మతిలేని మాటలు మాట్లాడుతున్నారు’

బీఆర్ఎస్ కీలక నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-23 11:30 GMT
‘హరీష్ రావు మతిలేని మాటలు మాట్లాడుతున్నారు’
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ కీలక నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోనియా గాంధీ కుటుంబంపై విమర్శలు చేయడం దారుణమన్నారు. సోనియా గాంధీ చొరవ లేకుంటే అసలు తెలంగాణ వచ్చేదే కాదని తెలిపారు. తెలంగాణను వ్యతిరేకించిన వారిని మంత్రులుగా చేసిన ఘనత మీదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రావడం లేదని సీరియస్ అయ్యారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో చావుదెబ్బ ఖాయమన్నారు. అన్ని చోట్లా డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమన్నారు. లోక్‌సభ తర్వాత ఇక రాష్ట్రంలో చూద్దామనుకున్నా బీఆర్ఎస్ కనిపించదు అన్నారు.

Tags:    

Similar News