Congress Leader: రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే

ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మీద హరీష్ రావు(Harish Rao) విమర్శలు చేస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే అని మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి(Sama Rammohan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-01-30 11:02 GMT
Congress Leader: రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మీద హరీష్ రావు(Harish Rao) విమర్శలు చేస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే అని మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి(Sama Rammohan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన గాంధీ భవన్‌(Gandhi Bhavan)లో మీడియాతో మాట్లాడారు. గతంలో ఉన్న ఐఏఎస్ అధికారుల నివాస సముదాయాలను కూల్చి ప్యాలెస్ కట్టుకుంది కేసీఆర్(KCR) అని గుర్తుచేశారు. ప్యాలెస్ సీఎం ఎవరు? అని అడిగితే ప్రజలే చెబుతారని అన్నారు. ప్రజల సీఎం రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి సమీక్ష చేస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు.

కేబినెట్ సమావేశాలు(Cabinet meetings), పాలన పరమైన నిర్ణయాలు సచివాలయం(Secretariat) నుంచే జరుగుతున్నాయి కదా అని అన్నారు. గతంలో సీఎం ఎక్కడ కూర్చుంటే అదే సచివాలయం అన్న కేసీఆర్ మాటలను హరీష్ రావు గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డి ఉదయం ఎనిమిది గంటల నుంచి సమీక్షలు చేస్తున్నారని.. అది తమ నిబద్దత అని అన్నారు. సీఎం ఇంటి దగ్గర కిలో మీటర్లు దూరంలో జనాన్ని అపుతున్నారని హరీష్ రావు అంటున్నారు. కిలో మీటర్లకు.. మీటర్లకు కన్ఫ్యూజ్ అవుతున్నారు కావొచ్చని ఎద్దేవా చేశారు.

‘హరీష్ రావు ఎప్పుడూ వస్తారో రండి నేను తీసుకుపోతా.. చూపిస్తా. కంచెలు పెట్టి గేటు బయట గద్దర్‌(Gaddar)ని గంటలకొద్ది ఆపి వెనక్కి పంపినప్పుడు.. మైనారిటీ మంత్రి మహ్మద్ అలీ(Muhammad Ali)ని హోంగార్డులతో ఆపించి వెనక్కి పంపించిన మీ ప్యాలెస్ పాలనను ప్రజలు మరిచిపోలేదు’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ తన ఫామ్ హౌస్(KCR Farm House) చుట్టూ పొలానికి వేసుకున్న ఫెన్సింగ్ మాదిరి పోలీసుల పహరా ఉండేదని గుర్తుచేశారు. ఫాంహౌస్ చుట్టూ ఉన్న ఊర్ల జనం ఊర్లోకి రావాలంటే ఐడీ కార్డులు చూపించే రాచరికపు పరిస్తితి ఉండేది. ఇజ్రాయిల్, పాలస్తీనా లాంటి దేశాల్లో ఉండే వాతావరణాన్ని.. కేసీఆర్ తన ఫాంహౌజ్ చుట్టూ క్రియేట్ చేసుకున్నారని అన్నారు. కేసీఆర్‌ను ప్యాలెస్ లాంటి తన ఫాం హౌస్ నుంచి ప్రజల్లోకి తీసుకొచ్చే బాధ్యత హరీష్ రావు తీసుకోవాలని సూచించారు. పిచ్చి విమర్శలు వదిలి ప్రజల కోసం నిజంగా పాటు పదండని సామా రామ్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News