రాత్రి సోనియాతో మాట్లాడా.. ఆ విషయం ప్రజలకు చెబుతానని చెప్పా: Priyanka Gandhi
రాత్రి సోనియాతో మాట్లాడా.. హైదరాబాద్‌లో ఉన్న.. రేపు భట్టి నియోజకవర్గానికి వెళ్తున్నా.. తెలంగాణకు వెళ్లావు ఏం మెసేజ్ ఇస్తావని సోనియా అడిగింది.. ప్రజలకు సత్యం
దిశ, వెబ్‌డెస్క్: రాత్రి సోనియాతో మాట్లాడా.. హైదరాబాద్‌లో ఉన్న.. రేపు భట్టి నియోజకవర్గానికి వెళ్తున్నానని చెప్పా.. తెలంగాణకు వెళ్లావు ఏం మెసేజ్ ఇస్తావని సోనియా అడిగింది.. ప్రజలకు సత్యం మాత్రమేనని చెబుతానని ఆమెతో చెప్పానని ప్రియాంక తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీ్ర్ వరకు భారత్ జోడో యాత్ర చేశారు, తెలంగాణలో భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేశారని ప్రియాంక గాంధీ అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఇద్దరు పాదయాత్ర చేయడం సంతోషంగా ఉందన్నారు. శనివారం మధిరలో నిర్వహించిన విజయభేరి సభలో ప్రియాంక గాంధీ ప్రసంగించారు.
భట్టి నియోజవర్గంలో ప్రచారం చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఇక్కడి ప్రజలు ఎంతో పోరాటం చేశారని సోనియా చెప్పారు.. కానీ తెలంగాణ ప్రజలు ఆశలు, ఆకాంక్షలు నేరవేరలేదని మండిపడ్డారు. బలమైన ప్రభుత్వం ఏర్పడి ఉంటే తెలంగాణ ప్రజలు కలలు నేరవేరేవని ప్రియాంక అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు తప్పని సరిగ్గా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీ నేరవేర్చలేదని ప్రియాంక మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయలేదు.. పండించిన పంటకు సరైన ధర ఇవ్వడం లేదని మండిపడ్డారు. పెరిగిన ధరలతో మహిళలు ఇబ్బందుకు పడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల బాధను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి అవినీతిలో కూరుకుపోయిందని, నిరుద్యోగుల బాధలు ఈ ప్రభుతవ్వానికి పట్టవని నిప్పులు చెరిగారు. తెలంగాణలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నేరవేర్చే ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తామని మరోసారి ప్రియాంక హామీ ఇచ్చారు.