త్వరలోనే కాంగ్రెస్‌లోకి 20 మంది BRS ఎమ్మెల్యేలు: జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో పలువురు గులాబీ ఎమ్మెల్యేలు, ఎంపీలు,

Update: 2024-02-07 14:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో పలువురు గులాబీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు లీడర్లు కాంగ్రెస్ నేతల టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. మొన్నటి వరకు జాయినింగ్స్‌కు ఇంట్రెస్ట్ చూపని కాంగ్రెస్.. తాజాగా చేరికల గేట్‌ ఓపెన్ చేసినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో పెద్దపల్లి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత చేరిక ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసినప్పటికీ ఎవరూ కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత మాత్రం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ చేరికల పర్వానికి తెరలేపిందని.. త్వరలోనే మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు కాంగ్రెస్ గూటికీ చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అవసరమైతే ఎమ్మెల్యేలను పార్లమెంట్ ఎన్నికల్లోపే పార్టీలో చేర్చుకుంటామన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల దగ్గర కాపలా ఉన్నా.. వాళ్లను పక్కన పెట్టుకున్నా.. ఏలాగైన సరే కాంగ్రెస్ పార్టీలో చేర్చకుంటామని జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు చేస్తున్నారన్న విషయం కేసీఆర్‌కు తెలుసని, ఆ భయం పట్టుకుని కేసీఆర్ నీళ్లు డ్రామా అడుతున్నాడని ఫైర్ అయ్యారు.

బీజేపీ, జగన్, కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలను తిప్పికొడతామన్నారు. మేం అప్రమత్తంగానే ఉన్నామని.. కాంగ్రెస్ ప్రభుత్వంపైన ఈగ కూడా వాలనివ్వమని అన్నారు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు వినిపిస్తోన్న నేపథ్యంలో.. 20 మంది గులాబీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారని జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎంపీ ఎన్నికల వేళ స్టేట్ పాలిటిక్స్‌లో సంచలనం రేపుతున్నాయి.

Tags:    

Similar News