ప్రధాని మోడీ, కేసీఆర్, అసదుద్దీన్.. ముగ్గురు పెద్ద దొంగలు: ఫిరోజ్ ఖాన్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్‌తో మూడు పార్టీలు బీఆరెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు కాంప్రమైజ్ అయ్యాయని నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ఆరోపించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్‌తో మూడు పార్టీలు బీఆరెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు కాంప్రమైజ్ అయ్యాయని నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ఆరోపించారు. బుధవారం గాంధీ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ స్వంత లాభం కోసం మూడు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ముగ్గురు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని చెప్పారు. స్టేట్‌లో కేసీఆర్.. సెంట్రల్ మోడీని గెలిపించాలని వీరి మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. బీఆరెస్‌కి, బీజేపీలకి ఎంఐఎం బీ టీం అని ఆరోపించారు.. తెలంగాణలో పుట్టిన ఎంఐఎం ఇక్కడ 10 స్థానాల్లో పోటీ చేయదు కానీ.. యూపీలో మాత్రం 100 స్థానాల్లో పోటీ చేశారని అయన గుర్తు చేశారు.
అసదుద్దీన్, కేసీఆర్ చెప్పిన వారికే బీజేపీ టికెట్ ఇచ్చిందని అన్నారు. గోషామహల్‌లో రాజాసింగ్ మీద ఎంఐఎం ఎందుకు అభ్యర్థిని పెట్టలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాజసింగ్ దగ్గర కేసీఆర్ ఎందుకు ప్రచారం చేయడంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తం పొలిటికల్ పొలారైజ్ చేస్తూ.. ప్రజలను చీటింగ్ చేస్తున్నారని ఆరోపించారు. కవిత కేసుతో ఒప్పందంలో భాగంగానే బండి సంజయ్‌ని తీసేసి.. కిషన్ రెడ్డిని తెచ్చారని తెలిపారు. మోడీ, కేసీఆర్, అసదుద్దీన్ ముగ్గురు పెద్ద దొంగలని విమర్శలు గుప్పించారు.