దాసోజు శ్రవణ్ ​మానసిక పరిస్థితి బాగా లేదు: కిరణ్​కుమార్​రెడ్డి

దాసోజు శ్రవణ్​మానసిక పరిస్థితి బాగా లేదని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్​కుమార్​రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డిని విమర్శిస్తే.. తోలు తీస్తామన్నారు.

Update: 2023-07-18 17:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దాసోజు శ్రవణ్​మానసిక పరిస్థితి బాగా లేదని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్​కుమార్​రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డిని విమర్శిస్తే.. తోలు తీస్తామన్నారు. పార్టీలు మారి కన్ఫ్యూజన్‌లో శ్రవణ్.. ఏం మాట్లాడుతుండో? అతనికే అర్థం కావడం లేదన్నారు. మంచి డాక్టర్‌ను సంప్రదిస్తే బెటర్ అని శ్రవణ్‌కు ఆయన సూచించారు. ఉచిత విద్యుత్ అంశంలో ఆధారాలతో చర్చకు వస్తామని తాము సవాల్ విసిరినందుకే బీఆర్ఎస్ నాయకులు ఇలా ప్రవర్తిస్తున్నారని ఫైర్​అయ్యారు. అంశాల వారీగా పార్టీల మధ్య ఫైట్ ఉండాలి కానీ.. వ్యక్తిగత విమర్శలు సరికాదన్నారు. ఇంకోసారి రేవంత్‌ను పర్సనల్‌గా తిడితే.. బీఆర్ఎస్ నాయకుల్లో ఎవర్నీ వదలమని హెచ్చరించారు.


Similar News