KTR : కాంగ్రెస్ వచ్చింది..నేతన్నల మగ్గాలను మళ్లీ ఆపింది : కేటీఆర్
తెలంగాణ కాంగ్రెస్(Congress) ప్రభుత్వం వచ్చాకా నేత కార్మికుల జీవనం(weaving looms) దుర్భరంగా మారిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్(Congress) ప్రభుత్వం వచ్చాకా నేత కార్మికుల జీవనం(weaving looms) దుర్భరంగా మారిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వచ్చింది..నేతన్నల మగ్గాలను మళ్లీ ఆపింది! కాంగ్రెస్ వచ్చింది..నేతన్నలను అప్పులపాలు జేసిందని, కాంగ్రెస్ వచ్చింది..నేతన్నలకు మళ్లీ ఉరితాడునిచ్చిందని విమర్శించారు. బతుకమ్మ చీరలతో నేతన్నలకు కేసీఆర్ ఉపాధితో కల్పిస్తే..కాంగ్రెస్సోల్లు కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేసేందుకు నేతన్న కడుపు కొడుతుండ్రని ఆరోపించారు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరలపై విపరీతమైన కక్ష వహిస్తూ మీ రాజకీయానికి అనాధలైన ఈ బిడ్డలకేది తల్లిదండ్రుల రక్షా అని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల చెంత అల్లారుముద్దుగా పెరగాల్సిన ఈ బిడ్డలను అనాధలు చేసిన పాపం ఊరికే పోదని.. ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుందంటూ శాపనార్ధాలు పెట్టారు. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా అంటూ మా గోరటి వెంకన్న పాడిన సాలెల మగ్గం సడుగులిరిగినయ్ అనే పాట కాంగ్రెస్ పాలనలో మళ్లీ యాదికొస్తుందంటూ విమర్శించారు.