పనికిమాలిన ముఖ్యమంత్రి Vs ప్రజా ముఖ్యమంత్రి.. కేసీఆర్‌పై కాంగ్రెస్ ట్వీట్ దుమారం!
పనికిమాలిన ముఖ్యమంత్రి వర్సెస్ ప్రజా ముఖ్యమంత్రి అంటూ కాంగ్రెస్ పార్టీ ఘాటు విమర్శలు చేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: పనికిమాలిన ముఖ్యమంత్రి వర్సెస్ ప్రజా ముఖ్యమంత్రి అంటూ కాంగ్రెస్ పార్టీ ఘాటు విమర్శలు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. రాజ్యాంగ విలువలకు తూట్లు పొడిచి.. రాజకీయ ప్రయోజనం కోసం గవర్నర్ నే పక్కన పెట్టిన గర్వం ఒక వైపు అని, రాజ్యాంగపు విలువలని పరిరక్షిస్తూ.. గవర్నర్‌తో సత్సంబంధాలు నెలకొల్పిన గౌరవం మరో వైపు అంటూ పేర్కొంది. మార్పు మొదలైందని గర్వం, గౌరవం అంటూ ఫోటోను షేర్ చేసింది.
అందులో అధికారం నాది.. అన్ని తానే అనే గర్వంతో విర్రవీగిన నాటి ముఖ్యమంత్రి.. పనికిమాలిన ముఖ్యమంత్రి అని కేసీఆర్ ఫోటోను సూచిస్తోంది. మరోవైపు అధికారం ప్రజలది.. నేను ప్రజా సేవకుడిని అని.. వినమ్రంగా నడుచుకునే నేటి ముఖ్యమంత్రి.. ప్రజా ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ ట్విట్‌పై బీఆర్ఎస్ శ్రేణులు కామెంట్స్ ఫైర్ అవుతున్నాయి.