Rythu Bheema: కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ప్రకటన..! రైతు బీమా దరఖాస్తులకు ఆహ్వానం
తెలంగాణలోని రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో మరో కీలక ప్రకటన చేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో మరో కీలక ప్రకటన చేసింది. రైతుభీమా పథకానికి అర్హులైన కొత్త రైతులకు అవకాశం కల్పిస్తూ.. దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ దరఖాస్తులను ఆగస్ట్ 5 వ తేదీ లోగా సమర్పించాలని ఓ ప్రకటనలో తెలియజేశింది. భూముల క్రయవిక్రయాలు, ఇతర రూపాల్లో చేతులు మారిన రైతుల భూములకు సంబందించి జూన్ 28వ తేదీ లోగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులతో పాటు.. గతంలో రైతు భీమాకు దరఖాస్తు చేయని రైతులు కూడా కొత్తగా రైతుభీమాకు ధరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రైతు భీమాలో మార్పులు చేర్పులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. రైతు భీమాలో ఆధార్ నామిని చనిపోయినా.. నామినిలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉన్నా.. ఈ తరహా దరఖాస్తులకు జూలై 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఇందులో 1965 ఆగస్ట్ 14 నుంచి 2006 ఆగస్ట్ మధ్యలో పుట్టిన రైతులు కొత్త దరఖాస్తుకు అర్హులుగా పేర్కొంది. దీని ప్రకారం ఆధార్ కార్డులో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు గల రైతులు మాత్రమే కొత్తగా రైతు భీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు. ఈ దరఖాస్తులకు ఫారంలో పొందుపరిచిన అంశాలు నింపి, దానితో పాటు భూమి పాస్ బుక్, తహసీల్దారు డిజిటర్ సంతకం, డీఎస్ పేపర్ సహా రైతు ఆధార్ కార్డ్, నామిని ఆధార్ కార్డు జిరాక్స్ పత్రులు జత చేసి, రైతు స్వయంగా ఏఈఓలకు సమర్పించాలని అధికారులు తెలిపారు. ఈ పథకం కింద ఏ కారణం చేతనైనా రైతు చనిపోతే.. బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల భీమాను ప్రభుత్వం అందజేస్తుంది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త పథకాలతో పాటు గత ప్రభుత్వ పథకాలను కూడా కంటిన్యూ చేస్తోంది. ఈ నేపథ్యలోనే రైతు భీమాకు మరో సారి అవకాశం కల్పించింది. దీంతో మరి కొంతమంది రైతులకు లబ్ది చేకూరనుంది.