ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్​ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది : మంత్రి ఉత్తమ్ ​కుమార్​రెడ్డి

రాష్ట్రంలో 2026 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా పెరిగితే రిజర్వేషన్లకు కూడా పెంచుతామని, 2011 గణాంకాల ప్రకారం వర్గీకరణ చేస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Update: 2025-03-18 16:48 GMT
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్​ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది : మంత్రి ఉత్తమ్ ​కుమార్​రెడ్డి
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 2026 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా పెరిగితే రిజర్వేషన్లకు కూడా పెంచుతామని, 2011 గణాంకాల ప్రకారం వర్గీకరణ చేస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఎస్టీవర్గీకరణ బిల్లుకు అన్ని పార్టీల ముక్తకంఠంతో మద్దతు ప్రకటించడం హర్షనీయమని, ఇలాంటి బిల్లులో తాను భాగస్వామ్యం కావడం ఎంతో గొప్పగా భావిస్తున్నానని తెలిపారు. మంగళవారం శాసనసభలో ఎస్సీవర్గకరణపై మాట్లాడుతూ దశబ్దలుగా ఎస్సి వర్గీకరణ కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లో అన్ని వర్గాలు మద్దతు ఇచ్చిన వస్తావా రూపం దక్కలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వం లో చిత్తశుద్ధి తో వర్గీకరణ చేశామని, ఇది నా అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఇంత చరిత్రత్మాకమైన నిర్ణయం లో తీసుకోవడం లో తాను ఉండడం నా రాజకీయ చరిత్రలో మరువలేని రోజు అన్నారు. ఎ

మ్మెల్యే గా తాను ఎంపికై నప్పటి నుంచి ప్రతి శాసనసభలో, పార్లమెంట్ లో ఎస్సి వర్గీకరణ జరగాలని అన్ని పార్టీ లు, ప్రభుత్వాలు ఎంతో గొప్పగా మాట్లాడేవని, అమలు చేసే సమయానికి తప్పించుకునే వారిని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఒక పకడ్బందీ ప్రణాళికతో ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాపార్టీ అగ్రనేత రాహుల్​గాంధీ ఈఅంశం ప్రజలకు వివరించేందుకు మంద కృష్ణ మాదిగతో కలిసి పలు వేదికలతో వర్గీకరణ అంశాలు పంచుకున్నారని గుర్తు చేశారు.

Tags:    

Similar News