పోటీ చేసే స్థానంపై కోమటిరెడ్డి క్లారిటీ

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని కోమటిరెడ్డి అన్నారు.

Update: 2023-04-22 07:49 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోయే స్థానంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో నల్గొండ నుంచే తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే తనకు ఒక ఓటు ఎక్కువ మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో గ్రూప్ తగాదాలు లేవని బీఆర్ఎస్, బీజేపీలోనే వర్గపోరు ఉందన్నారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ డబ్బు ఇచ్చిందనన్న విషయం తనకు తెలియదని, ఈటల ఆరోపణలను తాను టీవీల్లో చూశానన్నారు. ఆ ఎన్నికల్లో తాను దూరంగా ఉన్నందన అప్పుడు ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పారు. నల్గొండ జిల్లాను దత్తత తీసుకుంటానని చెప్పిన కేసీఆర్ పత్తా లేకుండా పోయారని ధ్వజమెత్తారు. ఈ నెల 28న నల్గొండలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయే నిరుద్యోగ నిరసన దీక్షలో తాను పాల్గొంటానని, జూన్ మొదటి వారంలో ప్రియాంక గాంధీ చేత నల్గొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..