గౌడన్నలతో షూటింగ్‌లు.. కేటీఆర్ దీన్నేమంటారు?: కాంగ్రెస్ కౌంటర్

మానవత్వం ఉన్న నాయకుడు ఎవరు ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడడని మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు.

Update: 2024-07-15 13:14 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మానవత్వం ఉన్న నాయకుడు ఎవరు ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడడని మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు. గౌడన్నలను ఆ చెట్ల మీద అంతంతసేపు నిలబెట్టి, వారి వృత్తి మీద చౌకబారు జోకులు వేస్తూ, దాన్ని ప్రచారానికి వాడుకోవడం అమానవీయం, దుర్మార్గం అని తాజాగా సోషల్ మీడయా వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

‘కేటీఆర్ దీన్నేమంటారు.. నాడు మీరు గౌడన్నలకు సరైన రక్షణ కిట్లు ఇవ్వకుండానే గంటల కొద్దీ తాటి చెట్లపై నిల్చోబెట్టి మీ పబ్లిసిటీ కోసం షూటింగ్‌లు చేయించారు. ట్విట్టర్ టిల్లు సమాధానం చెపితే బాగుంటుంది’ అని ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలోనే గత కేసీఆర్ పాలనలో గీత కార్మికులు తాటి చెట్టు ఎక్కి ‘థాంక్యూ కేసీఆర్’ అంటూ ప్రదర్శించిన వీడియో తెలంగాణ కాంగ్రెస్ పోస్ట్ చేసింది.

Tags:    

Similar News