BL సంతోష్ HYD పర్యటనపై కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్!
బీజేపీ పార్లమెంట్ విస్తారక్ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు చేరుకున్న బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బీ.ఎల్ సంతోష్‌పై కాంగ్రెస్ ఎటాక్ ప్రారంభించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ పార్లమెంట్ విస్తారక్ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు చేరుకున్న బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బీ.ఎల్ సంతోష్‌పై కాంగ్రెస్ ఎటాక్ ప్రారంభించింది. సంతోష్ పర్యటనపై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. గురువారం ఓ వీడియోను విడుదల చేసిన ఆయన.. సంతోష్ సొంత పార్టీ పటిష్టత కోసం వస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, కానీ ఆయన ఇక్కడికి వచ్చి పార్టీ ఫిరాయింపుల కమిటీ ఛైర్మన్‌తో భేటీ కావడం కాంగ్రెస్ నేతలను ఎలా బీజేపీలో చేర్చుకోవాలనే ఆలోచన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి పట్టుమని 20 మంది అభ్యర్థులు లేరని గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదన్నారు. తెలంగాణ ప్రజలను ఆకర్షించాలనుకుంటే కేంద్రం నుంచి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చి ప్రజల మన్నన పొందాలే తప్ప ఇతర పార్టీలోని నాయకత్వాన్ని తమ పార్టీలో చేర్చుకుని అధికారంలోకి వస్తామంటే అది కలగానే మిగిలిపోతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రజామోదం పొందాలంటే ఇలాంటి సమావేశాలతో బీజేపీకి ఎలాంటి ఉపయోగం లేదని బీఎస్ సంతోష్‌కు సూచించారు. తెలంగాణలోని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులను బీజేపీలో చేర్చుకుని అధికారంలోకి వస్తామని భావిస్తే అది భ్రమే అవుతుందన్నారు. తాను చెప్పింది అర్థం కాకుంటే తెలుగులోని సందేశాన్ని తర్జుమా చేసుకుని అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణను అవమానించిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Former MP Ponnam Prabhakar asks BL Santosh to get his statement translated, in case latter doesn't understand Telugu He lashed out at Santhosh for holding a meeting on allegedly poaching Congress leaders. @PonnamLoksabha pic.twitter.com/QUUbDqw1lN
— shinenewshyd (@shinenewshyd) December 29, 2022