BRS ఎమ్మెల్యేలపై ఈడీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
దళితబంధు, డబుల్ బెడ్రూం స్కీంలో కొంత మంది ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటున్నారని, వారి జాబితా తన వద్ద ఉందని సీఎం కేసీఆర్ చేసి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: దళితబంధు, డబుల్ బెడ్రూం స్కీంలో కొంత మంది ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటున్నారని, వారి జాబితా తన వద్ద ఉందని సీఎం కేసీఆర్ చేసి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు ఫిర్యాదు చేశారు. దళితబంధు, డబుల్ బెండ్రూం పథకాల్లో ఎమ్మెల్యేలు, వారి అనుచరులు రూ. 3 లక్షల కమీషన్లు అందుకుంటున్నారని పార్టీ మీటింగ్‌లో స్వయంగా సీఎం కేసీఆరే ఒప్పుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కమీషన్లు తీసుకుంటున్న వారి చిట్టా కేసీఆర్ దగ్గర ఉన్నట్లు పార్టీ మీటింగ్‌లో ఆయన వెల్లడించారని బక్క జడ్సన్ ఫిర్యాదులో ప్రస్తావించారు. ముఖ్యంగా గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేట, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాల నేతలే కమీషన్లు అందుకున్నారని, ఈ కుంభకోణంపై ఈడీ విచారణ జరపాలని బక్క జడ్సన్ అభ్యర్థించారు. కేసీఆర్‌కు పేర్లు తెలిసినా కూడా వాటిని దాచడం సబబు కాదన్నారు. వెంటనే వాటిని చట్టానికి అందించాలని ఈ సందర్భంగా జడ్సన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫిర్యాదు కాపీని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Also Read..