ఎయిర్‌పోర్ట్ రోడ్డును బ్లాక్ చేసిన స్థానికులు.. ఎందుకో తెలుసా?

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు రోడ్డు మార్గంలో స్థానికులు ఆందోళనకు దిగారు. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో తీవ్ర అసహనంతో రోడ్డుపై బైఠాయించి.. ఎయిర్‌పోర్టు రోడ్డును బ్లాక్‌ చేసి ఆందోళన చేపట్టారు.

Update: 2023-09-23 12:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు రోడ్డు మార్గంలో స్థానికులు ఆందోళనకు దిగారు. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో తీవ్ర అసహనంతో రోడ్డుపై బైఠాయించి.. ఎయిర్‌పోర్టు రోడ్డును బ్లాక్‌ చేసి ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నంలో స్థానికులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో శంషాబాద్‌-గగన్‌పహాడ్‌ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఎయిర్‌పోర్టు ప్రయాణికుల ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మరోవైపు వాహనాలను రోడ్లపై వదిలి ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులు పరుగులు పెట్టారు. కాగా, ఆందోళన చేపట్టిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అధికారులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Tags:    

Similar News