ESCI Director: కాన్వకేషన్ కు రండి.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఇస్కీ డైరెక్టర్ ఆహ్వానం

జనవరి 3వ తేదిన జరగనున్న ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ESCI) కాన్వకేషన్(Convocation) కార్యక్రమానికి హాజరు కావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnudev Varma)ను డైరెక్టర్ రామేశ్వర్ రావు కోరారు.

Update: 2024-12-14 16:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: జనవరి 3వ తేదిన జరగనున్న ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ESCI) కాన్వకేషన్(Convocation) కార్యక్రమానికి హాజరు కావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnudev Varma)ను డైరెక్టర్ రామేశ్వర్ రావు కోరారు. శనివారం రాజ్ భవన్(Raj Bhavan)లో ఇస్కీ చీఫ్ లక్ష్మీకాంత్ రావు, పీజీ స్కూల్ ప్రిన్సిపాల్ జగన్ మోహన్ రెడ్డి, ఫ్యాకల్టీ ఏ.రాజులతో కలిసి రామేశ్వరరావు గవర్నర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఇస్కీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంజనీర్లు, సైంటిస్టులు, టెక్నోక్రేట్స్ లకు వృత్తి పరమైన శిక్షణ కార్యక్రమాల గురించి డైరెక్టర్ వివరించారు. ఇస్కీ కార్యక్రమాలను గవర్నర్ అభినందించారు.


Similar News