CM Revanth: అలా ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదు.. సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
తనకు గాంధీ (Gandhi) కుటుంబంతో మంచి అనుబంధం ఉందని.. ప్రతి ఒక్కరికి ఫొటోలు దిగి చూపించాల్సిస అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తనకు గాంధీ (Gandhi) కుటుంబంతో మంచి అనుబంధం ఉందని.. ప్రతి ఒక్కరికి ఫొటోలు దిగి చూపించాల్సిస అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ ఢిల్లీలో నియోజకవర్గాల డీమిలిటేషన్ (Demilitarization), త్రిభాషా అంశాలపై ఆయన తమిళనాడు మంత్రి కేన్ నెహ్రూ (KN Nehru), డీఎంకే ఎంపీ కనిమొళి (MP Kanimozhi), డీఎంకే నేతతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌజ్‌కే పరిమితం అవుతున్నారని కామెంట్ చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ (KCR) బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని కోరారు. అధికార పక్షం.. విపక్షం కలిస్తేనే ప్రభుత్వమని అన్నారు.
అదేవిధంగా తనకు రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి మధ్య విబేధాలు తలెత్తాయని.. ఢిల్లీకి వస్తే అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వట్లేదంటూ బీఆర్ఎస్ నేతలు వదంతలు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. తనకు గాంధీ కుటుంబంతో మంచి అనుబంధం ఉందని స్పష్టం చేశారు. ఆ విషయంలో ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదని అన్నారు. తను ఎవరో తెలియకుండానే.. పార్టీ పీసీసీ చీఫ్ (PCC Chief)గా, రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ (BJP) నేతలు అడ్డం పడుతున్నారని.. తెలంగాణ (Telangana)కు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
తాను ఆరు గ్యారంటీ (Six Guarantees)లను అమలు చేసేందుకు నిధులు అడగడం లేదని.. RRR, మెట్రో (Metro), మూసీ సుందరీకరణ (Musi Beautification)కు మాత్రమే నిధులు అడుగుతున్నానని క్లారిటీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోని తెలంగాణ (Telangana)లో తాను చేసినన్ని పాలసీలు ఎవరూ చేయలేదని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి రూ.2.2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. 8.8 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటును 6.1 శాతానికి తగ్గించామని తెలిపారు. తెలంగాణతో పాటు సౌతిండియా (South India)కు నష్టం కలిగించే నియోజకవర్గాల డీలిమిటేషన్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెంటనే స్పందించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.