కేసీఆర్‌కు చెర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తా: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ భాష తీరుగా సరిగ్గా లేదని.. ఏం

Update: 2024-04-06 15:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ భాష తీరుగా సరిగ్గా లేదని.. ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకుంటా అని అనుకుంటున్నారు. కానీ కేసీఆర్ ఏం మాట్లాడిన చూస్తూ ఊరుకోవడానికి నేను జానారెడ్డిని కాదు.. రేవంత్ రెడ్డిననే విషయం గుర్తుంచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసీఆర్‌కు చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తానని హెచ్చరించారు. కేసీఆర్‌కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామన్నారు. శనివారం హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర పేరుతో భారీ బహిరంగ సభ తలపెట్టింది.

ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్లు తెలంగాణను దోచుకున్నారని నిప్పులు చెరిగారు. అధికారంలో ఉన్న పదేళ్లలో వందేళ్ల విధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కాలు విరిగింది.. కూతురు కవిత జైలుకు వెళ్లిందని ఏమనకుండా జాలి చూపించామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామన్నారు. ఢిల్లీ నుండి తెలంగాణకు నిధులు రావాలంటే రాష్ట్రంలో 14 మంది ఎంపీలను గెలిపించడని కోరారు. 


Similar News