Cm Revanth Reddy: ఇకపై వారికి కూర్చునే హక్కు!.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సానుకూల ప్రకటన

అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన సానుకూల ప్రకటన లక్షలాది మందిలో కొత్త ఆశలు చిగురింప చేస్తున్నాయి.

Update: 2024-08-02 07:46 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. సెక్యూరిటీ గార్డులు, ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు, పోలీస్ హోంగార్డులకు సిట్ టు రైట్ (కూర్చునే హక్కు) పై సీఎం స్పందించారు. ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు రోజుకు 10 నుంచి 12 గంటల నిలబడి విధులు నిర్వహిస్తున్నారని, ఈ విషయంలో వారికి ఉపశమనం కలిగేలా పని వేళలో వారికి కూర్చునే హక్కు కల్పించాలనే ప్రతిపాదనపై సభలో సీఎం రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ విధానం దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో అమలు అవుతున్నందునా అక్కడ ఉన్న విధివిధానాలను పరిశీలించి సాధ్యాసాధ్యాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సీఎం స్పందనతో లక్షలాది మంది ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. పని వేళలో కనీసం కూర్చొవడానికి సైతం అనుమతి లేక కుటుంబ పోషణ కోసం గంటల తరబడి నిల్చోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం గనుక సానుకూల నిర్ణయం తీసుకుంటే ఇన్నాళ్లు పడుతున్న తమ బాధలకు విముక్తి కలుగుతుందనే సంతోషం ఈ తరగతి ఉద్యోగులలో వ్యక్తం అవుతున్నది.

Tags:    

Similar News