CM Revanth Reddy: 'అది ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్' ..కొడంగల్ భూసేకరణపై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

నా సొంత ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడతానంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-23 13:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కొడంగల్ లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదని ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. లగచర్ల ఘటనపైన శనివారం సీఎంకు వామపక్ష పార్టీల ప్రతినిధుల బృందం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కొడంగల్ (Kodangal) ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి తన భాధ్యత అని, నా సొంత నియోజకవర్గ ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడతానన్నారు. నియోజకవర్గంలో యువత,మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. కొడంగల్ లో కాలుష్యరహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామని చెప్పారు. భూసేకరణ పరిహారం పెంపును సైతం పరిశీలిస్తామని అన్నారు. భూసేకరణ నేపత్యంలో గురువారం వామపక్ష పార్టీలు వికారాబాద్ జిల్లా లగచర్ల, రోటిబండ తండాల్లో పర్యటించి అక్కడి రైతులు, మహిళలతో మాట్లాడారు. లగచ్ల రైతుల గోడను సీఎం రేవంత్ రెడ్డికి వినిపిస్తామని ఆ సందర్భంలో చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎంతో భేటీ అయ్యారు. 

Tags:    

Similar News