సీఎంగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి తొలి ట్వీట్
తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవాళ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవాళ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరిందన్నారు. బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయని, ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుందని తెలిపారు. సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వళంగా వెలుగుతోందన్నారు. పేదల మొఖాల్లో వెలుగులు వెల్లివిరుస్తాయన్నారు. హక్కుల రెక్కలు విచ్చుకుంటాయన్నారు. ‘నా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయి. ఇది మీ అన్న ఇస్తున్న మాట’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరింది.
— Revanth Reddy (@revanth_anumula) December 7, 2023
బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి.
ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది.
సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుంది. పేదల మొఖాలలో వెలుగులు వెల్లివిరుస్తాయి.
హక్కుల రెక్కలు విచ్చుకుంటాయి.
నా తెలంగాణ ఆకాంక్షలు… pic.twitter.com/AmZfpFhqcn