Hydrabad: కమాండ్ కంట్రోల్ ఆఫీసులో సీఎం రేవంత్‌రెడ్డి అత్యవసర భేటీ
తెలంగాణ రాష్ట్రంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో, కేబినెట్ మంత్రులతో పాటు, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ (Command Control Center)లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన కేబినెట్ మంత్రుల(Cabinet Ministers)తో అత్యవసర భేటీ (Emergency meeting) నిర్వహించారు. ఈ సమావేశంలో, కేబినెట్ మంత్రులు మాత్రమే పాల్గొన్నారు. అయితే ఈ సమావేశానికి అధికారులు రావొద్దని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ అత్యవసర సమావేశంపై రాష్ట్రంలో సర్వత్రా చర్చ జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పాలన సంవత్సరం పూర్తి చేసుకున్న క్రమంలో పాలనపై చర్చించే అవకాశం ఉన్నట్లు పలువురు అంచనా వేస్తున్నారు. అలాగే పార్టీలో జరుగుతున్న కీలక పరిమాణలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తుంది. అలాగే త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC election) గెలుపు ఓటములపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ రోజు ఉదయం నగర శివారులో 10 మంది ఎమ్మెల్యేలు ఓ మంత్రికి వ్యతిరేకంగా రహస్య సమావేశం అయినట్లు వార్తలు వస్తున్న క్రమంలో.. సీఎం రేవంత్ రెడ్డీ (CM Revanth Reddy) ఈ అత్యవసర సమావేశాన్ని నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దీనికి తోడు శనివారం మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR) ఎర్రవల్లి లో మీడియాతో మాట్లాడుతూ.. తాను కొన్ని రోజులు ప్రభుత్వం చేస్తున్న పనులను గమనించానని.. ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పాలన (Congress rule) లో మళ్ళీ పాత రోజుల వచ్చాయని, అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే ‘కొత్త ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలనే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా.. గంభీరంగా చూస్తున్నా.. నేను కొడితే మాములుగా ఉండదు’ అని కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ వ్యాఖ్యలపై కూడా ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్ (Command Control Center) లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మంత్రులతో జరుగుతున్న అత్యవసర సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తుంది.
కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు మాత్రం.. ఇది కేవలం ప్రభుత్వ పాలనపై, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు (Performance of MLAs)పై నిర్వహించే రివ్యూ మీటింగ్ (Review meeting) లాంటిదని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకు తీసుకోవాల్సిన చర్యలను సీఎంతో పాటు మంత్రులు నిర్ణయాలు తీసుకోవడానికి సమావేశం ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికి రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకుంటున్న కీలక పరిణామాల మధ్య ఈ అత్యవసర భేటీ చర్చల్లోకి ఎక్కింది. మరీ ఈ అత్యవసర సమావేశంలో కేబినెట్ ఏ ఏ అంశాలపై చర్చించారు. ఏ ఏ నిర్ణయాలు తీసుకున్నారనే దానిపై క్లారిటీ రావాలంటే.. సీఎం కానీ, కేబినెట్ మంత్రులు కానీ సమావేశం అనంతరం వివరాలు వెళ్లడించాల్సి ఉంటుంది.