CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ హాస్టళ్ల తనిఖీ
రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్ల(welfare hostels) ల్లో పరిస్థితులను స్వయంగా అంచనా వేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రేపు సంక్షేమ హాస్టళ్ల తనిఖీ చేపట్టనున్నారు.
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్ల(welfare hostels)లో పరిస్థితులను స్వయంగా అంచనా వేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రేపు సంక్షేమ హాస్టళ్ల తనిఖీ చేపట్టనున్నారు. సీఎంతోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కల(Deputy CM Bhatti Vikramarka)తో సహా రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(CS Shanthikumari)తో పాటు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు గురుకుల, రెసిడెన్షియల్ హాస్టళ్లను శనివారం నాడు వ్యక్తిగతంగా సందర్శించి, అక్కడే విద్యార్ధులతో కలసి భోజనం చేసి పరిస్థితులను అంచనా వేయనున్నారు.
రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల హాస్టళ్లలోని దాదాపు 8 లక్షల మంది విద్యార్థులకు డైట్ చార్జీలు 40%, కాస్మోటిక్ చార్జీలు 200% పెంచుతూ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు రాష్ట్రంలోని పాఠశాలలో 667.25 కోట్లతో మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పించింది. హాస్టల్ల పనితీరును నిరంతరం పర్యేవేక్షించేందుకు ఆకునూరి మురళి(Akunuri Murali) అధ్యక్షతన స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ (Intigreated School) నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ, మైనారిటి హాస్టల్లో మరింత ప్రామాణికమైన ఆహారాన్ని అందించడంతోపాటు మెరుగైన విద్య బోధనా అవకాశాలను పెంపొందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రాష్ట్రంలోని అన్ని గురుకుల సంక్షేమ హాస్టల్లో పర్యటించి పరిస్థితులను స్వయంగా సమీక్షించనుంది.
ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన వివరాలు :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాల లోని ఏదో ఒక సంక్షేమ హాస్టల్ లో ఆకస్మిక తనికీ నిర్వహిస్తారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఖమ్మం జిల్లాలోని MJPBCWR JC (బాలికలు) మధిర పాఠశాల, బోనకల్ లో తనిఖీలు నిర్వహించనున్నారు.
మంత్రులు దామోదర రాజనరసింహ, భూపాలపల్లి జిల్లాలోని MJPBCWR JC(బాలికలు), మైలారం గ్రామం, ఘన్‌పూర్ లలో,
డి శ్రీధర్ బాబు, భూపాలపల్లి జిల్లాలోని MJPBCWR JC(బాలికలు), మైలారం గ్రామం, ఘన్‌పూర్,
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం జిల్లాలోని TGTWR JC (బాలికలు), మాదిరిపురం, తిరుమలాయపాలెం,
పొన్నం ప్రభాకర్, TGSWR JC(బాలుర), షేక్‌పేట, హైదరాబాద్,
కొండా సురేఖ, TGSWR JC(బాలురు), హతనూర, సంగారెడ్డి,
డి అనసూయ సీతక్క, ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలికలు), నేరడిగొండ, ఆదిలాబాద్, తుమ్మల నాగేశ్వరరావు, ఏకలవ్య మోడల్ RI, TWD,గండుగులపల్లి, దమ్మపేట మండలం, భద్రాద్రి కొత్తగూడం,
జూపల్లి కృష్ణారావు, TGSWR JC(బాలికలు), కొల్లాపూర్, నాగర్ కర్నూలలో తనిఖీలు నిర్వహించనున్నారు.