గవర్నర్‌కు రేవంత్ రెడ్డి స్వాగతం

ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి ఎల్బీ స్టేడియం చేరుకున్న గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను ఆయన స్వయంగా స్వాగతించారు.

Update: 2023-12-07 08:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి ఎల్బీ స్టేడియం చేరుకున్న గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను ఆయన స్వయంగా స్వాగతించారు. ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్త, పలువురు సీనియర్ అధికారులు గవర్నర్‌ను సాదరంగా వేదిక మీదకు తీసుకొచ్చారు. అప్పటికే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గే సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు చేరుకున్నారు. వేదిక మీదకు గవర్నర్ చేరుకున్న వెంటనే అప్పటికే ఆశీనులైన వారికి అభివాదం చేశారు.


Similar News