CM Revanth Reddy: బీఆర్ఎస్ పాలనలో ఆత్మస్థైర్యం కోల్పోయిన నిరుద్యోగులు : సీఎం రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో నిరుద్యోగమే అత్యంత కీలకమైందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Update: 2024-07-26 06:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో నిరుద్యోగమే అత్యంత కీలకమైందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వట్టినాగులపల్లిలో రాష్ట్ర విపత్తు నిర్వహణ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగుల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పానలలో నిరుద్యోగుల అత్మస్థైర్యం దెబ్బతిన్నదని ఆరోపించారు. యువత అంతా ఉద్యోగ, ఉపాధి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదరుచూశారని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కూడా నిర్యుద్యోగమే కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 90 రోజుల్లోనే 31వేల పైచిలుకు ఉద్యోగాలకు నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. అందరి ప్రాణాలు కాపాడటంలో అగ్నిమాపక సిబ్బంది పాత్ర కీలకమని అన్నారు. పాసింగ్ అవుట్ పరేడ్‌లో 483 మంది ఉద్యోగులు శిక్షణ పొందితే అందులో 90 శాతం మంది యువకులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కావడం సంతోషకరమని అన్నారు. ప్రజల ఆలోచనలు వినడం ప్రజా ప్రభుత్వం విధానమని స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో కూడా విద్యా, వ్యవసాయ రాంగాలకు అత్యంత ప్రధాన్యం కల్పించామని అన్నారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యాను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వాస్తవాలను అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందిచామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తారీఖునే వేతనం అందుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.   

Tags:    

Similar News