CM Revanth Reddy: ఆ విషయంలో తగ్గేదే లేదు.. పండుగ పూట సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న అసాంఘిక శక్తులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని.. ఆ విషయంలో తగ్గేదే లేదని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-03-30 06:44 GMT
CM Revanth Reddy: ఆ విషయంలో తగ్గేదే లేదు.. పండుగ పూట సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న అసాంఘిక శక్తులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని.. ఆ విషయంలో తగ్గేదే లేదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ రవీంద్ర భారతి (Ravindra Bharati)లో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఆధ్వర్యంలో ఉగాది (Ugadi) వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమార్ హాజరయ్యారు. అనంతరం సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నామని.. తనతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) జోడెద్దుల్లా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని కామెంట్ చేశారు.

డిప్యూటీ సీఎం భట్టి ప్రవేవపెట్టిన బడ్జెట్ ఉగాది పచ్చడిలా షడ్రుచులతో ఉందని అన్నారు. వ్యవసాయ అభివృద్ధికి, పేదలకు విద్య అందిచేందుకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. అదేవిధంగా విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమానికి నిధులు కేటాయించామని కామెంట్ చేశారు. తెలంగాణ రైజింగ్ అంటూ.. దేశంలో మన రాష్ట్రంలో ఓ వెలుగు వెలగాలి అన్నారు. దేశంలోనే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్‌ (9Food Security Act)ను తీసుకొచ్చి పేదలకు ఆకలి దూరం చేసేందుకు నాడు కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం చుట్టింద తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 56 వేల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి సాధించామని, ఇవాళ సాయంత్రం హుజూర్‌నగర్‌లో రేషన్ కార్డుపై అర్హులైన ప్రతి ఒక్కరికీ సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తున్నామి అన్నారు.

దేశంలోని కొత్త నగరాలకు హైదరాబాద్‌ ఫ్యూచర్ సిటీ (Future City) నమూనాగా మారనుందని జోస్యం చెప్పారు. అభివృద్ధి జరిగినటప్పుడు అడ్డంకులు వస్తాయని కామెంట్ చేశారు. రాష్ట్రం సంక్షేమం దిశగా దూసుకెళ్తోందని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. శాంతిభద్రతలను అదుపులో ఉంటనే పెట్టుబడులు వస్తాయని అందుకే అసాంఘిక శక్తులపై ఉక్కుపాద మోపామని పేర్కొన్నారు. దేశ ప్రజలకు తెలంగాణ ఆదర్శంగా ఉండాలని ప్రపంచ స్థాయిలో హైదరాబాద్‌ (Hyderabad)కు గుర్తింపు ఉండాలని ఆకాంక్షించారు. మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్‌రోడ్డు, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్‌లు ఇందులో భాగమేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 

Tags:    

Similar News