Suman: సీఎం రేవంత్ రెడ్డి రియల్ హీరో.. ఢిల్లీ ధర్నాలో యాక్టర్ సుమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సీఎం రేవంత్ రెడ్డిపై యాక్టర్ సుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Update: 2025-04-02 07:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీలకు రిజర్వేషన్లు ఎక్కడ వస్తాయని అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాత్రం రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీాయల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా బిల్లును తీసుకువచ్చి చూపించారని సినీ నటుడు సుమన్ (Actor Suman) అన్నారు. చెప్పినట్లుగా బీసీలకు రిజర్వేషన్లు తీసుకువచ్చిన సీఎం రేవంత్ రెడ్డి రియల్ హీరో అని ప్రశంసించారు. ఇవాళ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ (Delhi Jantar Mantar) వేదికగా జరుగుతున్న బీసీ మహాధర్నాకు (BC Mahadharna) సుమన్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మా బీసీలమంతా రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉంటామని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో బీసీలు, గౌడ్లు ఉన్నారు. రేవంత్ రెడ్డి పెద్దమనసు చేసుకుని వారికి ఎస్టీ స్టేటస్ ఇవ్వాలని కోరారు. ఈ డిమాండ్ చాలా కాలంగా ఉందని ఇది నెరవేరిస్తే మీరే మాకు దేవుడు అవుతారన్నారు. నరేంద్ర మోడీ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ధర్నాకు సీఎం రేవంత్ రెడ్డి సంఘాభావం:
బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును పార్లమెంట్‌లోనూ ఆమోదించి అమలు చేయడంతో పాటు దేశవ్యాప్తంగా కులగణన, 33 శాతం మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో బీసీ సంఘాలు నిర్వహిస్తున్న మహాధర్నా కొనసాగుతోంది. ఈ ధర్నాకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, ఎంపీలు కనిమొళి, సుప్రియా సూలే తదితరులు సైతం ధర్నాకు మద్దతు తెలిపారు. తెలంగాణ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ కోదండరామ్, కాంగ్రెస్ నేత వీహెచ్, సినీ నటుడు సుమన్, జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. బీసీ పోరు గర్జన సభకు రావాలని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను బీసీ సంఘాలు ఆహ్వానించినా రెండు పార్టీలు ధర్నాకు దూరంగా ఉన్నాయి.
Tags:    

Similar News