లోయర్‌ ట్యాంక్‌బండ్‌లో ఉద్రిక్తత.. బండి సంజయ్‌కి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌(Bandi Sanjay)కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఫోన్ చేశారు.

Update: 2024-10-19 08:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌(Bandi Sanjay)కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఫోన్ చేశారు. జీవో 29పై చర్చకు రావాలని ఆహ్వానించారు. ఇదిలా ఉండగా.. గ్రూపు-1 అభ్యర్థులతో కలిసి బండి సంజయ్ ర్యాలీగా సెక్రటేరియట్‌కు బయల్దేరారు. అడుగడుగునా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో లోయర్ ట్యాంక్‌బండ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంను కలిసి వాస్తవాలు వివరించేందుకు వెళ్తున్నామని చెప్పారు. సచివాలయానికి వెళ్లి తీరుతామని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అయితే.. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల వాయిదా, జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ అభ్యర్థులు గత కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌‌కు శనివారం వచ్చారు. కేంద్ర మంత్రి రాకతో భారీగా అక్కడికి గ్రూప్‌-1 అభ్యర్థులు తరలివచ్చారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఛలో సచివాలయానికి పిలుపునిచ్చారు. గ్రూప్‌-1 అభ్యర్థులతో కలిసి సచివాలయం వైపు ర్యాలీగా బయలుదేరారు. దీంతో ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

Tags:    

Similar News