CM Revanth Reddy: కులగణనతో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

కులగణన (Cast Census)తో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.

Update: 2024-11-14 13:01 GMT
CM Revanth Reddy: కులగణనతో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: కులగణన (Cast Census)తో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad)లోని ఎల్బీ స్టేడియం (LB Stadium)లో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana) సమాజం వ్యసనాల వైపు వేగంగా వెళ్తోందని.. గంజాయి (Ganja), డ్రగ్స్ (Drugs) లాంటి వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. గతంలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి (Chief Minister) పిల్లలను కలిశారా అని ప్రశ్నించారు. తెలంగాణ (Telangana)లో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.

సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కులగణన (Cast Census) సర్వే కొనసాగుతోందని తెలిపారు. కులగణన (Cast Census)తో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు (Reservations) అమలు కావాలంటే కులగణన (Cast Census) జరగాలని అన్నారు. కులగణన ఆధారంగా అమలు అవుతోన్న సంక్షేమ పథకాలను (Welfare Schemes) తొలగిస్తారని కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇది ఎక్స్‌రే కాదు.. మెగా హెల్త్ చెకప్ లాంటిదని అన్నారు. కొందరు గతంలో విద్యార్థుల శవాల మీద పదవులు పొందారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ధ్వజమెత్తారు.   

Tags:    

Similar News