రేపు వైరా సభకు సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడే రూ.2 లక్షల రుణమాఫీ చెక్కుల పంపిణీ

రేపు ఖమ్మం జిల్లా వైరాలో జరిగే భారీ బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

Update: 2024-08-14 13:30 GMT

దిశ, వెబ్ డెస్క్ : రేపు ఖమ్మం జిల్లా వైరాలో జరిగే భారీ బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. అదే వేదికపై నుండి రూ.2 లక్షలలోపు రుణమాఫీ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. ఉదయం గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవాల్లో పాల్గొని అక్కడి నుండి సీఎం ఖమ్మం చేరుకుంటారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతిష్టాత్మక సీతారామా ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులోని 3 పంపులను ఒకేసారి ప్రారంభించేలా అధికారులు న్ని ఏర్పాట్లు చేశారు. కమలాపురం పంప్ హౌసును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్విచ్ ఆన్ చేయనుండగా, జీ కొత్తూరు పంప్ హౌసును ఖమ్మం జిల్లా ఇంచార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రారంభిస్తారు. తదనంతరం సీఎం వైరా సభకు చేరుకొని ప్రసంగిస్తారు. అదే సభా వేదిక మీద తుది విడుతకు సంబంధించిన రూ.2 లక్షల రుణమాఫీ చెక్కులను అర్హులకు అందజేస్తారు. మధ్యాహ్నం తర్వాత రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు జమ కానునున్నాయి. వైరాలో జరిగే బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, నాయకులు తరలి రానున్న నేపథ్యంలో అందుకు తగినన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.      


Similar News