CM Revanth: ఇక నుంచి ఊరుకునే ప్రసక్తే లేదు.. సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్
కామన్ డైట్(Common Diet) ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: కామన్ డైట్(Common Diet) ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్(Residential Schools)లో ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉన్నారని నమ్మకం, ఆత్మవిశ్వాసం కలిగించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. రెసిడెన్షియల్ స్కూల్‌లో చదువుకున్న వాళ్లు ఎంతో మంది గొప్పగా రాణించారని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో సంపూర్ణ విశ్వాసం కల్పించాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. విద్యా వ్యవస్థను సమూల ప్రక్షాళన చేసి, విద్యా ప్రమాణాలు పెంచాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని అన్నారు. డైట్, కాస్మోటిక్, మౌలిక వసతులకు గత ప్రభుత్వం సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని తెలిపారు. ఇది ప్రజా ప్రభుత్వం అని నిరూపించేందుకు సింగిల్ స్ట్రోక్‌లో డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
పెరిగిన ధరలు, విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డైట్ ఛార్జీలు 40 శాతం, కాస్మోటిక్ 200 శాతం పెంచినట్లు తెలిపారు. దేశ చరిత్రలో ఒకేసారి ఇంత మొత్తం పెంచడం ఎక్కడా జరగలేదని అన్నారు. మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్‌ను మనం తయారు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ల లాంటివని అన్నారు. ఫుడ్ పాయిజన్ జరిగి ఈ మధ్య ఒక బాలిక మరణించింది.. ఆ బాలిక తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు.. పిల్లల విషయంలో శ్రీమంతుడుకి, పేదవాడికి వారి పిల్లల పట్ల ఒకే రకమైన ప్రేమ ఉంటుంది.. మనల్ని నమ్మి వాళ్లు హాస్టళ్లకు పంపితే.. మనం ఎంత బాధ్యతగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయాలని అధికారులకు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.. ఇకనుంచి నేను ఎక్కడికి వెళ్లినా రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేస్తా.. ఎవరైనా తప్పు చేస్తే వారిపై చర్యలు తప్పవు అని సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు.