CM Revanth Reddy: పదేళ్లు రాష్ట్రానికి చంద్ర గ్రహణం పట్టింది.. సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
తెలంగాణ రాష్ట్రానికి పదేళ్ల పాటు చంద్రగ్రహణం పట్టిందని.. మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) రాష్ట్రానికి పదేళ్ల పాటు చంద్రగ్రహణం పట్టిందని.. మాజీ సీఎం కేసీఆర్ (KCR)ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ పరేడ్ గ్రౌండ్ (Parade Ground)లో ఇందరా మహిళా శక్తి (Indira Mahila Shakthi) బస్సులను ఆయన ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల పాటు రాష్ట్రానికి చంద్ర గ్రహణం పట్టిందని కామెంట్ చేశారు. ఆ గ్రహణం వీడటంతో ఆడబిడ్డలు ఆత్మ గౌరవంతో నిలబడి స్వేచ్ఛగా ఉన్నారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం కావాలని రాష్ట్రంలోని మహిళలు కోరుకున్నారని తెలిపారు. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తే వన్ ట్రిలియన్ ఎకానమీ (One Trillion Economy) సాధ్యమవుతోందని అన్నారు. కేసీఆర్ (KCR), కాంగ్రెస్ (Congress) పాలనకు ఉన్న తేడాను మహిళామణులు గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు
భవిష్యత్తులో మహిళా సంఘాలు కార్పొరేట్ కంపెనీ (Corporate Company)లతో పోటీపడేలా చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ (Telangana)లో 65 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణను స్వయం సహాయక సంఘాలకు అప్పగించామని అన్నారు. స్కూల్ పిల్లలకు యూనిఫాంలు కుట్టే బాధ్యతలను కూడా వారికే అప్పగించామని గుర్తు చేశారు. ఇందుకోసం త్వరలోనే ప్రతి జిల్లాలో ఇందిరా శక్తి భవనాలు నిర్మిస్తామని అన్నారు. సోలార్ (Solar) ఉత్పత్తిలో అదానీ (Adani), అంబానీ (Ambani)లతో మా ఆడబిడ్డలు పోటీ పడేలా చేస్తామని తెలిపారు. కేసీఆర్ (KCR) మొదటి దఫా ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని.. అది ఆ పార్టీ మహిళకు ఇచ్చే గౌరవం అని ఎద్దేవా చేశారు. రాబోయే అసెంబ్లీ (Assembly), పార్లమెంట్ (Parliament) ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు ఇచ్చి గెలుపించుకుంటామని అన్నారు. ప్రతి మండలంలో మహిళా సంఘాలకు రైస్ మిల్లులు, గోడౌన్లు కట్టించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కూలితే పైశాచిక ఆనందం పొందతున్నారని కామెంట్ చేశారు. వాళ్ల ఆనందం కోసం తనను టార్గెట్‌గా చేసుకుని నోటికొచ్చినట్లు వాగుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలకు కష్టం వస్తే ఆదుకోవడానికి ప్రయత్నించాలని.. పైశాచిక ఆనందం పొందేటోళ్లు ఎన్నటికీ బాగుపడరని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.