BREAKING: విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్

విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుండి బకాయిలు లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తామని

Update: 2024-07-13 11:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుండి బకాయిలు లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తామని ప్రకటించారు. శుక్రవారం జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా ‘క్వాలిటీ ఇంజనీరింగ్ సదస్సు’ అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జేఎన్టీయూ పరిధిలో కళాశాలలు నిర్వహిస్తున్నా సిబ్బందికి ప్రభుత్వ విధానం తెలియాలని.. అందుకే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. తొలిసారి ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానం ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. ప్రస్తుత విద్యా సంవత్సరం నుండి బకాయిలు లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయాలని తాను ఆదేశాలు ఇస్తు్న్నానని కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచంలోని దేశాల్లో ఏదైనా గొప్పగా ఉందంటే అది ఇంజనీర్లు చేసిందేనని ప్రశంసించారు. తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీలకు సహయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిరుద్యోగులను తయారు చేసే పరిశ్రమలుగా కళశాలలు ఉండకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశానికి అత్యంత అవసరమైందని సివిల్ ఇంజనీరింగ్ అని.. అలాంటింది కొన్ని కళాశాలల్లో సివిల్ ఇంజనీరింగ్ లేకుండా చేసే విధంగా ప్రణాళికలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో కచ్చితంగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులను నడపాలని సూచించారు. ఇంజినీరింగ్ కాలేజీల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఈ మూడు కోర్సులు లేకపోతే దేశం ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇంజనీరింగ్ కళాశాలలు ఉద్యోగాలు సృష్టించే సంస్థలుగా కాకుండా మేధావులను అందించే సంస్థలు ఉండాలని సూచించారు. గత సీఎంలు తీసుకున్న విధానాల వల్ల మనం ఐటీ, ఫార్మా రంగాల్లో ముందు ఉన్నామని వ్యాఖ్యానించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇంజనీరింగ్ కాలేజీల్లో కోర్సులు ఉండాలని, ఫార్మా, ఐటీ, ఏఐ ప్రపంచాన్ని నడిపించబోతోందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాల్లో ఏఐకి సంబంధించిన కోర్సు ప్రవేశపెట్టాలని సూచించారు. ఏఐకి రిలేడేట్ కోర్సులు ప్రవేశపెడితే ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుందని హామీ ఇచ్చారు. త్వరలోనే రాష్ట్రంలో స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఆ వర్సిటీకి అటానమస్ హోదా ఇస్తామని వెల్లడించారు. పక్కా రాష్ట్రాలతో కాకుండా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా మనం ఉండాలని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

Tags:    

Similar News