CM Revanth Reddy: తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన అలయ్ బలయ్

కొడంగల్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ఈ కార్యక్రమానికి హాజరు కాగా.. ఆయనను బండారు దత్తాత్రేయ ప్రత్యేకంగా సన్మానించారు.

Update: 2024-10-13 08:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పటి తెలంగాణ నేత, ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. కొడంగల్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ఈ కార్యక్రమానికి హాజరు కాగా.. ఆయనను సాంస్కృతిక బృందాలతో ఆహ్వనం పలికారు. బండారు దత్తాత్రేయ స్వయంగా ఆయనను సన్మానించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అలయ్ బలయ్ కార్యక్రమం గురించి ప్రసంగించారు.

ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంలో అలయ్ బలయ్ స్ఫూర్తి నింపిందని, ఒకప్పుడు తెలంగాణలో రాజకీయ పార్టీల పరంగానే కార్యక్రమాలుండేవని, కానీ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో పార్టీలకతీతంగా అన్ని పార్టీలను ఒకే గొడుగుపైకి తీసుకొచ్చిన గొప్ప కార్యక్రమం అలయ్ బలయ్ అని అన్నారు.

‘‘ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్‌యూ, కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టుల వరకు అందరూ ఒక్కటై తెలంగాణ కోసం గళం వినిపించారు. అలయ్ బలయ్ అంటే బండారు దత్తాత్రేయ గుర్తుకువస్తారు. తెలంగాణ సంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత. 19 ఏళ్లుగా దత్తాత్రేయ అలయ్ బలయ్ నిర్వహిస్తూ తెలంగాణ కళలను భావితరాలకు అందిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు అలయ్ బలయ్ స్ఫూర్తినిచ్చింది. జెండలను పక్కన పెట్టి తెలంగాణ కోసం అందరూ ఒక్కటయ్యేలా చేసింది.’’ అని గుర్తు చేశారు.

అలయ్ బలయ్ కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ నుంచి ఆయన కుమార్తె బండారు విజయలక్ష్మి వారసత్వంగా తీసుకోవడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి సంప్రదాయం తప్ప, రాజకీయాలతో సంబంధం లేదని కొనియాడారు. దీన్ని నిలబెట్టుకోవాలన్సిన అవసరం ఉందన్నారు. కుల, మత, పార్టీలకతీతంగా అందరం ఈ కార్యక్రమంలో ప్రతి ఏటా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News