కొండగట్టు ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు
కొండగట్టు అంజన్న ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు.
దిశ, మల్యాల/ కొడిమ్యాల: సీఎం కేసీఆర్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. బుధవారం ఫామ్ హౌస్ నుండి హెలికాప్టర్‌లో కొండగట్టులోని జేఎన్టీయూ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకున్నారు.
సీఎం కేసీఆర్‌కు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు రవి శంకర్, విద్యాసాగర్ రావు, డాక్టర్ సంజయ్, జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష, ఎస్పీ, పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.
సీఎం కేసీఆర్ కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం కొండగట్టు మాస్టర్ ప్లాన్ పనులను పర్యవేక్షించనున్నారు. అనంతరం ఘాటు రోడ్డులో జరిగిన బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు.