అవార్డులు రావడంపై సీఎం కేసీఆర్ హర్షం

పచ్చదనం, పరిశుభ్రతతో పాటు పలు అభివృద్ధి ఇతివృత్తాలు విభాగాల్లో తెలంగాణ గ్రామపంచాయతీలు దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలువడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

Update: 2023-04-17 13:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పచ్చదనం, పరిశుభ్రతతో పాటు పలు అభివృద్ధి ఇతివృత్తాలు విభాగాల్లో తెలంగాణ గ్రామపంచాయతీలు దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలువడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన మొత్తం 46 ఉత్తమ అవార్డుల్లో 13 అవార్డులను తెలంగాణ కైవసం చేసుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాల్లో 9 థీం ఆధారిత విభాగాల్లో అవార్డుల ఎంపిక కాగా, 8 విభాగాల్లో తెలంగాణ అవార్డులను సాధించడం విశేషమన్నారు.

పల్లె ప్రగతి సహా గ్రామీణాభివృద్ధి దిశగా దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి కార్యాచరణకు ఈ అవార్డులు సాక్ష్యంగా నిలిచాయని పేర్కొన్నారు. పంచాయతీల అభివృద్ధిలో తెలంగాణ ప్రతి అంశంలోనూ అగ్రగామిగా నిలిచి, అత్యధిక అవార్డులు గెలుచుకున్న స్పూర్తితో తెలంగాణ ఆదర్శంగా దేశవ్యాప్తంగా పల్లెల అభివృద్ధికోసం కృషి కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News