సైబర్ నేరాలపై CID చీఫ్ మహేశ్ భగవత్ కీలక వ్యాఖ్యలు
భవిష్యత్తులో సైబర్‌నేరాలు మరింతగా పెరుగుతాయని సీఐడీ ఛీఫ్మహేశ్భగవత్చెప్పారు. ఇంటర్నెట్ఉపయోగిస్తున్న ప్రతీ ఒక్కరికి సైబర్‌నేరస్తుల నుంచి ప్రమాదం పొంచి ఉన్నట్టు తెలిపారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: భవిష్యత్తులో సైబర్‌నేరాలు మరింతగా పెరుగుతాయని సీఐడీ ఛీఫ్మహేశ్భగవత్చెప్పారు. ఇంటర్నెట్ఉపయోగిస్తున్న ప్రతీ ఒక్కరికి సైబర్‌నేరస్తుల నుంచి ప్రమాదం పొంచి ఉన్నట్టు తెలిపారు. కేంద్ర హోంమంత్రిత్వ వ్యవహారాల శాఖ సూచనల మేరకు మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీహెచ్ఆర్డీ) తో కలిసి సీఐడీ విభాగం 30మంది జూనియర్ సివిల్జడ్జీలకు సైబర్‌నేరాలు, చట్టాలు అన్న అంశంపై ఎంసీహెచ్ఆర్డీలో సోమవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా భగవత్ మాట్లాడుతూ.. సైబర్‌నేరస్తుల ఉచ్చులో చిక్కి మోసపోయిన కొందరి కేసులను ప్రస్తావించారు. ఓ వ్యక్తి ఇంటర్నెట్లో చూసి ఆర్థిక అవసరాలను తీర్చుకోవటం కోసం ఓ కిడ్నీని అవసరమైన వ్యక్తికి ఇచ్చాడని తెలిపారు.
అయితే, బాధితున్ని వలలోకి లాగిన సైబర్నేరస్తుడు ఇస్తానని చెప్పిన మొత్తంలో కేవలం పదిశాతమే ఇచ్చి ఇంటికి పంపించి వేశాడని తెలిపారు. ప్రతీరోజూ సైబర్‌మోసాల వార్తలు వెలుగులోకి వస్తున్న విషయం అందరికీ తెలిసిందే అని చెప్పారు. సైబర్‌నేరాలపై పోలీసులు, పబ్లిక్‌ప్రాసిక్యూటర్లు, జ్యుడిషియల్ఆఫీసర్లు, అదనపు సెషన్స్జడ్జీలు మరింతగా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం ప్రారంభమైన శిక్షణా తరగతులు ఈనెల 29వరకు కొనసాగుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఐజీగా పనిచేసి రిటైర్అయిన ఉమాపతి, సైబర్‌లా ఎక్స్పర్ట్, టెక్నో లీగల్కన్సల్టెంట్డాక్టర్సాయి సుశాంత్, సైబర్‌సెక్యూరిటీ నిపుణుడు శ్రీనివాస్, విజిలెన్స్అండ్ఎన్ఫోర్స్మెంట్డీఎస్పీ రవికుమార్‌రెడ్డి, సైబర్‌క్రైం ఇన్వెస్టిగేషన్సీఐ పద్మతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.