విచారణకు హాజరైన చీకోటీ.. రూ.100 కోట్లపై ఈడీ ఫోకస్!

క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కుమార్ సోమవారం ఈడీ ఎదుట హాజరయ్యారు.

Update: 2023-05-15 06:45 GMT
విచారణకు హాజరైన చీకోటీ.. రూ.100 కోట్లపై ఈడీ ఫోకస్!
  • whatsapp icon

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కుమార్ సోమవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. థాయిలాండ్ దేశం పటాయాలో ఇటీవల క్యాసినో వ్యవహారం వెలుగు చూడటం... అక్కడి పోలీసులు చీకోటీని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయిదు రోజుల్లోనే రూ.100 కోట్ల రూపాయల గ్యాంబ్లింగ్ జరిగినట్టు పటాయా పోలీసులకు ఆధారాలు దొరికాయి. ఈ వ్యవహారంలో లావాదేవీలన్నీ హవాలా మార్గంలో జరిగినట్టు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు చీకోటీకి నేపాల్ క్యాసినో కేసుకు సంబంధించి విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసారు.

నోటీసులు పాత కేసులో ఇచ్చినా పటాయా క్యాసినో వ్యవహారం పైనే చీకోటీని విచారిస్తున్నట్టు సమాచారం. దాంతోపాటు లగ్జరీ కార్ల విషయంపై కూడా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా బంజారాహిల్స్ లో సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం చేస్తున్న నసీర్, మోసిన్ లకు కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ ఇద్దరు కూడా సోమవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. చీకోటీకి ఈ ఇద్దరి మధ్య ఉన్న సంబంధాలపై ఈడీ ఆరా తీస్తున్నట్టు సమాచారం. వీరి నుంచి చీకోటీ గతంలో కార్లు కొన్నాడా? కొంటే ఎన్ని కార్లు? ఏ బ్రాండ్ కార్లు కొన్నాడు? అన్న అంశాలపై విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. దాంతోపాటు తన పేరు మీదనే చీకోటీ కార్లు కొన్నాడా? బినామీ పేర్ల మీద కొన్నాడా? అన్న దానిపై కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం.

Tags:    

Similar News