పార్టీ పేరును మళ్లీ TRSగా మార్చండి.. బీఆర్ఎస్ MLA సంచలన డిమాండ్

అసెంబ్లీ ఎన్నికల ఓటమి వేళ స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన డిమాండ్ చేశారు.

Update: 2024-01-11 03:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల ఓటమి వేళ స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రజల్లో తనదైన ముద్ర వేసిన పార్టీ బీఆర్ఎస్‌గా పేరు మార్చుకోవడం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపిందన్నారు. వరంగల్ లోక్ సభ సన్నాహక సమావేశంలో కడియం కీలక డిమాండ్‌ను కేటీఆర్ ముందు ఉంచారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్‌ను సొంత పార్టీగా భావించారని కానీ.. పార్టీ పేరు నుంచి తెలంగాణను తొలగించడం సెంటిమెంట్‌ను తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు.

టీఆర్ఎస్‌తో ఉన్న అటాచ్‌మెంట్, సెంటిమెంట్ బీఆర్ఎస్‌గా పేరు మార్చడంతో పోయిందన్నారు. ఈ అంశంపై ఫోకస్ పెట్టి వెంటనే బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చే విషయంలో పునరాలోచించాలని కేటీఆర్‌ను కడియం కోరారు. పార్టీ పేరు మార్పుతో కనీసం 1-2 శాతం ఓట్లు పార్టీకి పడలేదన్నారు. బీఆర్ఎస్‌ను టీఆర్‌ఎస్ గా మార్చాలని కార్యకర్తలు, నాయకులే కాకుండా మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారన్నారు.

టీఆర్ఎస్ పేరిట తిరిగి పార్టీ పేరు మార్చే ప్రతిపాదనను గులాబీ బాస్ కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కడియం పార్టీ నేతలను కోరారు. ఇక, పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా మార్చాలనే డిమాండ్ వస్తుండటంతో అధినేత కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. నేషనల్ పాలిటిక్స్‌లో ఎంట్రీ కోసం టీఆర్ఎస్ పేరు స్థానంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా గులాబీ బాస్  మార్చిన విషయం తెలిసిందే.  

Tags:    

Similar News