Chamala: పవన్ కల్యాణ్​ వాస్తవాలు చెప్పారు.. ఎంపీ చామల కిరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్​(Pawan Kalyan) వాస్తవాలు మాత్రమే మాట్లాడారని ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) పేర్కొన్నారు.

Update: 2024-12-30 16:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పవన్ కల్యాణ్​(Pawan Kalyan) వాస్తవాలు మాత్రమే మాట్లాడారని ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) పేర్కొన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ...ఏపీ డిప్యూటీ సీఎం రాజకీయ కోణం కంటే, మానవత్వంతో మాట్లాడరన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్(Allu Arjun Arrest) విషయంలో రూలింగ్ పార్టీని వ్యతిరేకించడానికి బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పోటీ పడ్డారన్నారు. కానీ ఏపీ డిప్యూటీ సీఎం చాలా చక్కగావాస్తవ పరిస్థితులు వివరించారన్నారు. కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడరని తాము భావించడం లేదని, కానీ జగన్ లాంటి పాలన ప్రస్తుతం తెలంగాణ లో లేదు అని పవన్ క్లారిటీ ఇచ్చారని గుర్తు చేశారు.

అల్లు అర్జున్ అరెస్టు విషయం దేశవ్యాప్తంగా చర్చ జరిగిందన్నారు. అంబటి రాంబాబు మంచి కళాకారుడని విమర్శించారు. నెక్స్ట్ సినిమాలో అంబటి రాంబాబుకి మంచి రోల్ తో పాటు, డ్యాన్స్ కూడా బాగా వేస్తాడన్నారు. ఇక అల్లు అర్జున్ అరెస్టు తో సినిమాకి ఇంకా ఎక్కువ కలెక్షన్లు వచ్చినట్లు తమకు సమాచారం ఉన్నదన్నారు. పుష్ప సినిమా ఇంకా రెండు నెలలు నడుస్తుందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అడుగుతున్న గురుకుల హాస్టల్ విద్యార్థిని శైలజ కుటుంబాన్ని సీఎం ఎందుకు పరామర్శించలేదు? అంటూ ప్రతిపక్షాలు అనవసరమైన రాద్దాంతం చేస్తున్నాయని, కానీ అన్ని చోట్లకు వెళ్లడం సీఎంకు సాధ్యం కాదన్నారు. ముఖ్యమంత్రిని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదన్నారు. కావాలనే బీజేపీ, బీఆర్ఎస్ లు తమ సీఎం రేవంత్ ను టార్గెట్ చేస్తున్నాయని ఎంపీ చామల మండిపడ్డారు.

Tags:    

Similar News