Chamala Kiran Kumar Reddy: స్పీకర్ ఏకపక్ష తీరు సరికాదు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
లోక్‌సభ స్పీకర్(Speaker), రాజ్యసభలో ఛైర్మన్(Chairman)ల తీరు సరైన విధానంలో లేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిశ; తెలంగాణ బ్యూరో: లోక్‌సభ స్పీకర్(Speaker), రాజ్యసభలో ఛైర్మన్(Chairman)ల తీరు సరైన విధానంలో లేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని అంశాలు చర్చకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. శనివారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ..భారత రాజ్యాంగం మీద చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీ పట్టుపడుతుంటే, ఈ శీతకాల సమావేశాల్లో ఎన్డీఏ ప్రతిపక్షాలకు సరైన సమయం ఇవ్వకుండా గేమ్ ఆడుతున్నాయని మండిపడ్డారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఉల్లంఘనకు పాల్పడుతుందన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వానికి 400 ఎంపీ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చే వాళ్లని గుర్తు చేశారు. బీజేపీ కుట్ర ఎన్నికల కంటే ముందు బయటపడటంతో దేశ ప్రజలు ఎన్డీఏ కూటమికి ఆశించిన స్థాయిలో సపోర్టు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ కుట్రలు మొదలు పెట్టిందన్నారు. రాజ్యాంగాన్ని మార్చి నిబంధనలను తుంగలోకి తొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు. తాను కొత్తగా ఎంపికైన ఎంపీనని, తనకు పార్లమెంట్ లో మాట్లాడేందుకు సరైన సమయం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉభయ సభల్లోనూ ఇదే తీరు ఉందని, కొంత మంది వ్యక్తుల కోసమే భారత రాజ్యంగాన్ని ఎన్డీఏ తాకట్టు పెట్టిందన్నారు. పదేళ్ల పాలనతో దేశంలో బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్ లు ప్రజలను మోసం చేశాయని, బీజేపీ కుట్రలను దేశ ప్రజలు గమనించాలని కోరారు.