తెలంగాణపై కేంద్రం చిన్నచూపు: Minister Puvwada
తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని మంత్రి పువ్వాడ అజయ్ ఆరోపించారు.
దిశ ,మణుగూరు : తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని.. రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాకుండా అడ్డుకుంటోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఆరోపించారు. మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక పక్క సీతారామ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతుంటే కేంద్రం ప్రాజెక్ట్ పనుల అనుమతులు మళ్లీ కోరడం కక్ష్య పూరిత చర్య అని మంత్రి అన్నారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోనే సాధ్యమని మంత్రి అన్నారు.
ఏజెన్సీ ప్రాంతమైన పినపాక నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపారన్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాలను గెలిచి తీరుతామని ధీమా వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కొనుగోలు చేసే కుట్రను ఛేదించి ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు నిబద్ధత కలిగిన ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారని మంత్రి అన్నారు. పినపాక నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కుట్రను తిప్పి కొట్టడంతో ఎమ్మెల్యే రేగా కాంతారావు ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి అత్యంత అభిమానాన్ని చూరగొన్నారని కొనియాడారు.
దీంతో ముఖ్యమంత్రి ఏజెన్సీ ప్రాంతమైన పినపాక నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక అభివృద్ధి నిధుల నుండి రూ.100 కోట్లను కేటాయించారని గుర్తు చేశారు. నిధుల ఘనత రేగా కాంతారావుకే దక్కుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం డీఎంఎఫ్ నిధులు రూ.46 కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. డీఎంఎఫ్ నిధుల నుండి మణుగూరు డిగ్రీ కళాశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.2.50 కోట్లు , మణుగూరు బస్ డిపో ఎదురుగా బస్టాండు నిర్మాణం కోసం రూ.4 కోట్లు, అశ్వాపురం మెయిన్ రోడ్ సెంట్రల్ లైటింగ్ కోసం రూ.4 కోట్లు, మొండికుంట డ్రైన్ నిర్మాణం కోసం రూ.1.50 కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.
Also Read......
భీంగల్ సీఐ ఎస్ఐల దౌర్జన్యం నశించాలంటూ.. ఏర్గట్ల పోలీస్ స్టేషన్ ఎదుట స్వర్ణకారుల ధర్నా